Elige una pista para reproducir
ఊ ఉ ఉ
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
ఆ ఆ ఆ ఆ
ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో
జాబిలి వెలిగేను మనకోసమే
అహహా ఆ
ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో
జాబిలి వెలిగేను మనకోసమే
నెయ్యాలలో తలపుటుయ్యాలలో
నెయ్యాలలో తలపుటుయ్యాలలో
అందుకొంద్దాము అందని ఆకాశమే
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
ఆ చందమామలో ఆనంద సీమలో
వెన్నెల స్నానాలు చేయుదమా
అహహా ఆ
ఆ చందమామలో ఆనంద సీమలో
వెన్నెల స్నానాలు చేయుదమా
మేఘాలలో వలపు రాగాలలో
మేఘాలలో వలపు రాగాలలో
దూర దూరాల స్వర్గాల చేరుదమా
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
ఈ పూలదారులూ ఆ నీలి తారలు
తీయని స్వప్నాల తేలించగా
అహహా ఆ
ఈ పూలదారులూ ఆ నీలి తారలు
తీయని స్వప్నాల తేలించగా
అందాలనూ తీపి బంధాలను
అందాలనూ తీపి బంధాలను
అల్లుకుంద్దాము డెందాలు పాలించగా
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా