ఏదో ఏదో అయిపోతుంది
ఎదలో ఏదో మొదలయ్యింది
నిన్నే చూడాలనీ నీతో ఉండాలనీ
నేనే ఓడాలనీ నువ్వే గెలవాలనీ
పదే పదే అనిపిస్తుంది
నీ పిలుపే వినిపిస్తుంది
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతనా
అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావనా
కళ్ళేమో కలలు మాని నిన్ను వెతుకుతుంటే
మనసేమో పనులు మాని నిన్ను తలుచుకుంటే
కాళ్ళు నీతో కలిసి నడవాలని కలవర పడుతుంటే
చెయ్యి నీతో చెలిమి చెయ్యాలని తొందర పడుతుంటే
వేరే దారి లేక నా దారే నువ్వయ్యాక
తీరం చెరినాక ఈ కెరటం ఆగలేక
నిన్నే తాకాలని నీతో గడపాలని
ముద్దే ఇవ్వాలని పొద్దే పోవాలని
మనసేమో మనసిచ్చింది వయసేమో చనువిచ్చింది
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతనా
అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావనా
ఏదో ఏదో అయిపోతుంది
ఎదలో ఏదో మొదలయ్యింది
సరిగరిసనిసని పమ పా మా పా మా పాసా గామాపని
సరిగరిసనిసని పమ పా మా పా మా పాసాని గామప
ఆరాటం హద్దు దాటి మాట చెప్పమంటే
మోమాటం సిగ్గుతోటి పెదవి విప్పనంటే
ఉత్సాహం నిన్నే పొందాలని ఉరకలు వేస్తుంటే
ఉల్లాసం నీకే చెందాలని పరుగులు తీస్తుంటే
ఏమి పాలుపోక సగపాలే నువ్వయ్యాక
ప్రాయం వచ్చినాక పరువం ఆగలేక
నువ్వే కావాలని నిన్నే కలవాలని
మనసే విప్పాలని మాటే చెప్పాలని
ఒళ్ళంతా పులకిస్తుంది తుళ్ళింతా కలిగిస్తుంది
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతనా
అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావనా
ఏదో ఏదో అయిపోతుంది
ఎదలో ఏదో