Elige una pista para reproducir
పల్లవి
ఇంత కంటే - చోద్యమిక వేరు యున్నదె
యెంత ఆశ్చర్యమయ్యా - చూడ
అనుపల్లవి
వింతలు నీ కథలు విన విన వేడుకలు
కంతుని గన్న చ - క్కని వేణుగోపాల
చరణం
భృగురాముడై యల - జగతి కశ్యప మునికి
తెగువ నర్పించిన - దేవుడవూ
మగటిమి చెడి బలిని - మధుర భాషణముల
వగ లేక ధర మూడ - డుగులు వేడినావంటె
||ఇంత|
చరణం
అక్షయ వలువలు అల్ల ద్రౌపతి కిచ్చి
రక్షించినట్టి శ్రీ - రమానాథుడా
కక్షి కట్టుక గోప కామినుల మైలలు
నిక్షేపమ్ముగ బట్టి - వృక్ష మెక్కినావంటే
ఇంత
చరణం
శంకాటంకము లేక - జలరాశి బంధించి
లంకేశు నణచిన రణధీరుడా
కంకపత్రము దొడిగి - కాలయవనుడు దరుమ
బింకేల బోయి కొండ - బిలము జొచ్చినావంటె
॥ఇంత