Elige una pista para reproducir
పల్లవి
దాతను వాజులు'జెరిపే దబ్బిలి -
తల మీదనె సొడ్డు - చెయ్యి
అనుపల్లవి
ధాతువు దెలియని వైద్యము -
జేసే - ధగిడీ కొక సొడ్డు - గట్టిగ
దాతను
చరణం
పని లేకను పౌరుగిండ్లకు తిరిగే -
పణతికి వక సొడ్డు - చెప్పిన
మనవులు భూపతి కెరుగించని దు -
ర్మంత్రికి వక సొడ్డు - గట్టిగ //దాతను//
చరణం
కలిగియుండి పొట్టకు దినజాలని -
కఠినుని కొక సొడ్డు - తన
వెలదిని పరపురుషుల తార్చే మగ -
వెధవకు నొక సొడ్డు - గట్టిగ //దాతను//
చరణం
లంచము దిని పనులు చక్కసేయని
లండికి వక సొడ్డు -మాట
మించనాడి చై వెలకల వేసే -
వంచకునికి సొడ్డు - గట్టిగ //దాతను/
చరణం
తన పద్యము విని బహుమతి సేయని -
మనుజుని కొక సొడ్డు - పెద్దల
గని దండము బెట్టక జుణిగే గణి- -
కాంగన కొక సొడ్డు - గట్టిగ /దాతను
చరణం
మాపురే పనుచు నర్ధుల ద్రిప్పే -
మడియకు వక సొడ్డు- వేణు
గోపాలు భక్తుల దూషించే -
కొంటెల కొక సొడ్డు - గట్టిగ //దాతను//