Elige una pista para reproducir
॥పల్లవి॥ ఒకటి కొకటికిని వొడగాయ
సకలంబునకును సమరసమాయ
॥చ1॥ కలికినెమ్మోము కళల మెరుగులకు
లలిఁ దురుము మొగులు లావాయ
తొలి తొలి వలపుల తొలుకరికాలము
వలనుగ నిదిగో వచ్చెను నేఁడు
॥చ2॥ రమణి కంకణపురవళి వురుములకు
చెమటల సోనలు చెలరేఁగె
తమకపు టాసల తగువెదకాలము
తమలపు ముదమునఁ దలకొనె నేఁడు
॥చ3॥ పడఁతి బొమల సురపతి చాపములకు
సడులని ప్రియముల జడి వట్టె
బడి శ్రీవేంకటపతిరతికాలము
తొడరి యింతట నెదురుకొనె నేఁడు