Elige una pista para reproducir
॥పల్లవి॥ ఎచ్చోటి కేఁగిన యెప్పుడూఁ దమలోని -
మచ్చిక పెనుఁదెవులు మానకపోయె
॥చ1॥ పాయపు సతులగుబ్బల పెదపొట్లాల
కాయము వడి నొత్తి కాఁచఁగను
రాయిడిచే ఘనమాయఁగాని లోని-
మాయపు పెనుఁదెవులు మానకపోయె
॥చ2॥ అతివల మోహపుటధరామృతములు
యితవుగ నోరి కందియ్యఁగను
అదిమోహమే ఘనమాయఁగాని లోని-
మతకరిపెనుఁదెవులు మానకపొయె
॥చ3॥ తరుణుల మేనిమెత్తనిపరపులమీఁద-
నిరవుగ నిటు సుఖియించఁగను
తిరువేంకటాచలాధీశుకృపచేఁగాని
మరుచేతి పెనుఁదెవులు మానకపోయె