Elige una pista para reproducir
జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంనద రామ గోవిందా జోజో జోజో
జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంనద రామ గోవిందా జోజో జోజో
నందునింటనుజేరి నయముమీరంగా చంద్రవదనలు నీకు సేవచేయంగా
అందముగ వారిండ్ల ఆడుచుండంగా మందలకు దొంగ మా ముద్దురంగా జోజో జోజో
పాలవారాశిలో పవళించినావు బాలుగా మునులుకు అభయమిచ్చినావు,
మేలుగా వసుదేవుకుదయించినావు బాలుడై ఉండి గోపాలుడైనావూ జోజో జోజో
అంగజునిగన్న మాయన్నయిటు రారా
బంగారుగిన్నెలో పాలుపోసేరా
దొంగనీవని సతులు పొంగుచున్నరా
ముంగిటానాడరా మొహనాకారా జోజో జోజో
అంగుగా తాళ్ళాపాకనయ్య చాలా శృంగార రచనగా చెప్పెనీ జోల
సంగతిగ సకల సంపదలు నీవేలా మంగళము తిరుపట్ల మదనగోపాలా జోజో జోజో
జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంనద రామ గోవిందా జోజో జోజో