Elige una pista para reproducir
పుట్టినరోజు పండగే అందరికి
మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి
పుట్టినరోజు పండగే అందరికి
మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి ఎందరికి ఎందరికి
కలిమికేమి వలసినంత ఉన్నా మనసు చెలిమి కొరకు చేయి చాచుతుంది
ఆ మనసే ఎంత పేదైదైనా అనురాగపు సిరులు పంచుతుంది
మమత కొరకు తపియించే జీవనం
మమత కొరకు తపియించే జీవనం దైవమందిరంలా పరమపావనం
పుట్టినరోజు పండగే అందరికి
మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి ఎందరికి ఎందరికి
పువ్వెందుకు తీగపై పుడుతుంది జడలోనో గుడిలోనో నిలవాలని
ముత్యమేల కడలిలో పుడుతుంది ముచ్చటైన హారంలో మెరవాలని
ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని
ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని
తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలని
తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలని
తానున్నా లేకున్నా తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి
పుట్టినరోజు పండగే అందరికి
మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి ఎందరికి ఎందరికి