ఓ చిలక రా చిలక
నీ కలలే పండెనుగా
మాఘమాసం వచ్చేనంట మల్లె పూలతో
ఓ చిలక రా చిలక
నీ కలలే పండెనుగా
మాఘమాసం వచ్చేనంట మల్లె పూలతో
ఓ చిలక రా చిలక
నీ కలలే పండెనుగా
అందాల ఓ మేఘమా
నామాట మన్నించవే
నే వేచి ఉన్నానని
తనతోటి వివరించవే
నవ్వే గులాబి చెలీ
నీ నవ్వు చాలించవే
నీలోని అందాలన్నీ నాబుగ్గలో చూడవే
కుర్రవాడి కొంటెచూపు తల్చుకుంటె చాలునే
పాల బుగ్గ సిగ్గుతోటి ఎర్రబారి పోవునే
పొంగుతున్న వయ్యారాల వింత మెరుపుతో
ఓ చిలక రా చిలక
నీ కలలే పండెనుగా
చిగురాకు పొత్తిళ్లలో దాగున్న ఓ కోయిల
కైపెక్కి నువు పాడినా
పాటల్ని విన్నానులే
నీకెవరు సరిలేరనీ గర్వంతో కవ్వించకే
నా బావతో ఉండగా
నువ్వొచ్చి వేదించకే
గుండెలోని ఆశలన్ని గువ్వలైన వేళలో
గున్నమావి పూతమేసి గుట్టు బయటపెట్టకే
కొంగుజారి పోయేవేళ కన్నుకొట్టకే
ఓ చిలక రా చిలక
నీకలలేె పండెనుగా
మాఘమాసం వచ్చేనంట మల్లె పూలతో