Elige una pista para reproducir

Sencillo / Pista
ఏకో రాజా విశ్వరూపధారి శాసించే చక్రధారి
అంతేలేని ఆధిపత్య శౌరి దండించే దండకారి
శాంతి కోసం రక్తపాతం వీడు పలికే యుద్ధపాఠం
నల్ల దందా నాగలోకం వీడు తొడిగే అంగుళీకం
కర్మ భూమిలోన నిత్య ధర్మగామి
వేటుకొక్క చెడును వేటలాడు సామి
ఎక్కడుంటేనేమి మంచికితను హామీ ఒక్క మాటలోన సర్వాంతర్యామి
గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్గా డ్ ఫాదర్ గాడ్ ఫాదర్
ఆకసం పట్టని నామధేయం
నిర్భయం నిండిన వజ్రకాయం
ఆపదే అంటని అగ్నిగేయం వీడో ధ్యేయం వీడి వెలుగు అద్వితీయం
ఆటగా ఆడిన రాజకీయం
అంతరంగం సదా మానవీయం
సాయమే సంపద సంప్రదాయం వీడో ధైర్యం
వీడి పలుకు పాంచజన్యం
అందలాలు పొందలేని పట్టం వీడే
అక్షరాలకందిరాని చట్టం వీడే
లక్షలాది గుండె సడుల చుట్టం వీడే
అనుబంధం అంటే అర్ధం వీడే
మంచి చెడ్డ పోల్చలేని ధర్మం వీడే
తప్పు ఒప్పు తేల్చలేని తర్కం వీడే
పైకంటి చూపు చూడలేని మర్మం వీడే
కరుణించే కర్త కర్మ వీడే