Elige una pista para reproducir
పల్లవి
తిన్నగా మాటాడరా వేణుగోపాల -
పున్నెమబ్బీని నీకు
అనుపల్లవి
మొన్నరేయి నీ - సన్న దెలుసుకొని
కొన్నమగడు నాపయి - కోపించేర సామి
చరణం
ఎంతో వేడుకతో - నెనసి ముచ్చటలాడి
వింతరతులు గూడవేళ - సంతనగాదు
వంతకారి బావ - వచ్చేటి వేళాయె
రంతులు సేయకు - రచ్చకోర్వను సామి
తిన్నగా
చరణం
విరుల పాన్పు పయిని వేడుక లలరగను
గురుకుచముల చేర్చు - కొందు నింకొకసారి
మరుగులేక - యెరుపుగా నుండితే చాలు నాసామి
॥తిన్నగా
చరణం
గుత్తగానివలె - నింతింతై వచ్చేవు
అత్త కంటే మోస - మంగడిబెట్టు
చిత్తాన నెనరుంటె - చేరి యుండగవచ్చు
వత్తురెవ్వరైన - వడిగ గూడర సామి.
॥ తిన్నగా॥