Elige una pista para reproducir
చిననాటి ప్రేమ చితిమంటలోన
చీకటే అయితున్నాదే
నా ప్రేమ మరిసి ఒంటరిగా
ఇడిసి రానంటూ పోతున్నదే
ఏ పాపమో నేను చేసానోగాని
ఈ బాధ ఎదురైనదే
యే నేరమో నేను చేసానో గాని
నరకమే దారినాధే
నూరెళ్లు నాతోడు ఉంటానని
వదిలేసి పోతున్నావా
రాలేవా రాలేవా నా చెంతకి
ఎదురు చూస్తున్న నీరాకకి
రాలేవా రాలేవా నా చెంతకి
కడదాక తోడుంటా నీ కాటికి
చిననాటి ప్రేమ చితిమంటలోన
చీకటే అయితున్నాదే
నా ప్రేమ మరిసి ఒంటరిగా
ఇడిసి రానంటూ పోతున్నదే
నీ నుధిటి పైనా తిలకాన్ని దిద్ది
ముద్దాడాలనుకున్నానే
నీ సిగకు మల్లెపూలెన్నో తెచ్చి
అల్లాలి అనుకుంటే
నీ సీర కొంగు నా సేతబట్టి
అడుగుయానుకుంటినే
నీ కన్నుసైగల్లో నా బతుకువచ్చి
తోడుందామనుకున్నానే
మాటల్లో కాలచావు నా ఆశలు
మరిచేపోయావ్ మన ఊసులు
రాలేవా రాలేవా నా చెంతకి
ఎదురు చూస్తున్న నీరాకాకి
రాలేవా రాలేవా నా చెంతకి
కడదాక తోడుంటా నీ కాటికి
చిననాటి ప్రేమ చితిమంటలోన
చీకటే అయితున్నాదే
నా ప్రేమ మరిసి ఒంటరిగా
ఇడిసి రానంటూ పోతున్నదే
నీయమ్మ లాగా నా ఒళ్ళో దాచి
ప్రేమించాలనుకున్నానే
మీ నాన్నలాగా కోరింది ఇచ్చి
కాపాడాలనుకుంటినె
నీ కంట కన్నీరు రాణియ్యక
నవ్వులనే కురిపిద్దునే
యే బాధ నీ సెంత రాకుండనే
కనుపాపయ్యి కాదువె
చీకటిలో కలిపావు నా కలాలని
చితిలోన కాల్చావు నా ప్రేమని
రాలేవా రాలేవా నా చెంతకి
ఎదురు చూస్తున్న నీరాకాకి
రాలేవా రాలేవా నా చెంతకి
కడదాక తోడుంటా నీ కాటికి