Elige una pista para reproducir
॥పల్లవి॥ శిరసు వంచకు మిఁక శ్రీనరసింహా నీ
సిరు లెన్నైనాఁ గలవు శ్రీ నరసింహా
॥చ1॥ చెలి నీతోడపై నెక్కె శ్రీనరసింహా
చెలరేఁగె నీమోము శ్రీనరసింహా
సెలవుల నవ్వుదేరె శ్రీనరసింహా నీమై
చెలప చెమట లుబ్బె శ్రీనరసింహా
॥చ2॥ చేరఁడేసికన్ను ల శ్రీనరసింహా
చీరుమూరాడీ వలపు శ్రీనరసింహా
చీరకొంగంటేవేమీ శ్రీనరసింహా
చేరె నీకు నామేలు శ్రీనరసింహా
॥చ3॥ చేవల్లకు వచ్చితివి శ్రీ నరసింహా నా-
సేవలెల్లా మెచ్చితివి శ్రీనరసింహా
శ్రీవేంకటాద్రి మీఁది శ్రీనరసింహా
చేవమీరె నీవేడుక శ్రీనరసింహా