Elige una pista para reproducir
Sencillo / Pista
చెప్పకే చెప్పకే ఊసుపోని మాటలు చాలులే వేలాకోలం ఊరుకో
నేర్పకే నేర్పకే లేనిపోని ఆశలు మనసా మళ్ళీ రాకు వెళ్ళిపో
ఎగసే కలలే అలలై ఎదనే ముంచేసేలే
కదిలే కథలే కడలై ఉప్పెనల్లే ఊపేసేలే
ఎందుకీ బంధాలన్నీ కలపకులే నిలపకులే గెంటేస్తాను గెంటేస్తాను నిన్నిక ఇపుడే
మనసా కనబడితే ఎదురుగ నిలబడితే చంపేస్తాను చంపేస్తాను తొందరపడితే
చల్లనైన చూపు నువ్వే మంచి గంధపు మాట నువ్వే ముళ్లకంచెలన్నీ తెంచి పూల బాటవయ్యావే
మోయలేని హాయి నువ్వే నన్నే మార్చిన మాయ నువ్వే ముందు నువ్వు వెళ్తావుంటే వెంట నీడనయ్యానే
వేసవి వేడిలో లేతగాలై వచ్చావే మమతే కురిసి మనసే తడిసెలే
నువు నా జతగా ఉంటె బతికా నే ధైర్యమై తెలిసేనిపుడే ఇపుడే జీవితాన మాధుర్యమే
వింతగా నన్నే నేను మరచితినే మురిసితినే నిన్నా లేని మొన్నా లేని వెన్నెల విరిసే మ్ మ్
మదికొక మది దొరికే కలతల కథ ముగిసే అంతే లేని సంతోషాల కాంతులు కురిసే
నువ్వు నేను వేరు అన్నా నీవైపస్సలు చూడకన్నా దొంగలాగ కళ్ళే నిన్నే తొంగి తొంగి చూసాయే
పగ్గమేసి ఆపుతున్నా ప్రేమే కాదిది స్వార్ధమన్నా సిగ్గులేని కళ్ళే నన్నే ముగ్గులోకి తోసాయే
నా మదే ఈ విధి ప్రేమ మదే అయిందే కుదురే మరచి వరదై ఉరికెలే
తపమే తపమై జపమై నిలిచా నీకోసమే జడిలా ముసిరే కసిరే జ్ఞాపకాల్ని తోసేసాలే
ప్రేమకే రూపం నువ్వు అని తెలిసే మది మురిసే గుండె తీసి దండే చేసి రమ్మని పిలిచే
ఎద ఇది నిలవదులే నిను ఇక వదలదులే ఆనందాల మహాసంద్రామాయను మనసే