Elige una pista para reproducir
పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా
పొడగంటిమయ్య మిమ్ము
పురుషోత్తమా మమ్ము
ఎడయకవయ్య కోనేటి రాయడా
పొడగంటిమయ్య మిమ్ము
పురుషోత్తమా మమ్ము
ఎడయకవయ్య కోనేటి రాయడా
పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా
కోరిమమ్ము నేలినట్టి కులదైవమా చాల
కోరిమమ్ము నేలినట్టి కులదైవమా చాల
నేరిచి పెద్దలిచ్చిన నిదానమా
కోరిమమ్ము నేలినట్టి కులదైవమా చాల
నేరిచి పెద్దలిచ్చిన నిదానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా మాకు
చేరువ జిత్తములోని శ్రీనివాసుడా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా మాకు
చేరువ జిత్తములోని శ్రీనివాసుడా
పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా
రోగా లడచి రక్షించే దివ్యౌషధమా
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా
రోగా లడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా శ్రీనివాసా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము
గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము
గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా
పొడగంటిమయ్య మిమ్ము
పురుషోత్తమా మమ్ము
ఎడయకవయ్య కోనేటి రాయడా
పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా
పురుషోత్తమా పురుషోత్తమా