Elige una pista para reproducir
కాపోల్ల ఇంటికాడ కామూడాటలట పడుసోళ్లంత వచ్చి ఆడుకుంటరట
ఆడబోదమా బావ సూడబోదమా మనం ఆడబోదమా బావ సూడబోదమా
కాపోల్ల ఇంటికాడా కామూడాటలటా పడుసోళ్లంత వచ్చి ఆడుకుంటరట
ఆడబోదమా బావ సూడబోదమా మనం ఆడబోదమా బావ సూడబోదమా
జాలూ తండలోన తీజు పండుగటజనాలంత గూడి జాతర జేస్తరట
కూడిబోదమా బావ సూడబోదమా మనం కూడిబోదమా బావ సూడబోదమా
జాలూ తండలోనా తీజు పండుగట జనాలంత గూడి జాతర జేస్తరట
కూడిబోదమా బావ సూడబోదమా మనం కూడిబోదమా బావ సూడబోదమా
శాలోళ్ల ఇంటికాడ సక్కాని సీరాలట సీరకూదగ్గ రైకపోతాలు పోస్తరట
పొయ్యి వస్తవా బావ గొని తెస్తవా నువ్వు పొయ్యి వస్తవా నాకు గొని తెస్తవా
శాలోళ్ల ఇంటికాడ సక్కాని సీరాలట సీరకూదగ్గ రైకపోతాలు పోస్తరట
పొయ్యి వస్తవా బావ గొని తెస్తవా నువ్వు పొయ్యి వస్తవా నాకు గొని తెస్తవా
బెస్తోళ్లింటీకాడ ఒట్టీ శాపాలట ఒట్టి సేపల కూర గట్టీగుంటదట
వండిపెడతరా నీకు తినపెడతరా బావ వండిపెడతరా నీకు తినపెడతరా
బెస్తోళ్లింటీకాడా ఒట్టీ శాపాలటా ఒట్టి సేపల కూర గట్టీగుంటదట
వండిపెడతరా నీకు తినపెడతరా నేను వండిపెడతరా నీకు తినపెడతరా
పెసరు బండ మీద ప్రేమా జంటలట ప్రేమాగల్ల మాట సెప్పుకుంటరట
గూడిబోదమా బావ సూడబోదమా మనం కూడిబోదమా బావ సూడబోదమా
పెసరు బండ మీదా ప్రేమా జంటలటా ప్రేమాగల్ల మాట సెప్పుకుంటరట
గూడిబోదమా బావ సూడబోదమా మనం కూడిబోదమా బావ సూడబోదమా