Elige una pista para reproducir
ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ
ఓ ఓ ఓ ఓ మరుమల్లెలలో మావయ్య మంచి మాట సెలవీవయ్య
పున్నమి వెన్నెల గిలిగింతలకు తూగిన మల్లెల మురిపాలు నీ చిరునవ్వుకు సరికావమ్మ (ఓ ఓ ఓ ఓ)
ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ
ఎవరన్నారో ఈ మాట వింటున్నాను నీ నోట తెలిసీ పలికిన విలువేలా (ఆ ఆ ఆ ఆ)
ఓ ఓ ఓ ఓ మరుమల్లెలలో మావయ్య
వలచే కోమలి వయ్యారాలకు కలసే మనసుల తియ్యదనాలకు కలవా విలువలు సెలవీయ (ఓ ఓ ఓ ఓ)
ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ
పై మెరుగులకే భ్రమపడకయ్య మనసే మాయని సొగసయ్య
గుణమే తరుగని ధనమయ్య (ఊ ఊ ఊ ఊ)
ఓ ఓ ఓ ఓ మరుమల్లెలలో మావయ్య మంచి మాట సెలవీవయ్య
ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ