Elige una pista para reproducir
పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవవురా ఉయ్యాలవాడ నారసింహుడా
చరిత్ర పుటలు విస్మరించ వీలులేని వీరా రేనాటిసీమ కన్న సూర్యుడా
మృత్యువే స్వరాన చిరాయురస్తు అనగా ప్రసూతి గండమే జయించినావురా
నింగి శిరసువంచి నమోస్తు నీకు అనగా నవోదయానివై జనించినావురా
హో సైరా హో సైరా హో సైరా
ఉసస్సు నీకు ఊపిరాయెరా
హో సైరా హో సైరా హో సైరా
యసస్సు నీకు రూపమాయెరా
అహంకరించు ఆంగ్ల దొరలపైన హుంకరించగలుగు ధైర్యమా
తలొంచి బతుకు సాటివారిలోన సాహసాన్ని నింపు శౌర్యమా
శృంఖలాలనే తెంచుకొమ్మని స్వేచ్ఛ కోసమే శ్వాసనిమ్మని నినాదం నీవేరా
ఒక్కొక్క బిందువల్లె జనులనొక్కచోట చేర్చి సముద్రమల్లె మార్చినావురా
ప్రపంచమొనికిపోవు పెనుతుఫానులాగ వీచి దొరల్ని ధిక్కరించినావురా
మొట్టమొదటి సారి స్వతంత్ర సమరభేరి పెఠిల్లు మన్నది ప్రజాలి పోరిది
కాలరాత్రి వంటి పరాయి పాలనాన్ని దహించు జ్వాలలో ప్రకాశమే ఇది
హో సైరా హో సైరా హో సైరా
ఉసస్సు నీకు ఊపిరాయెరా
హో సైరా హో సైరా హో సైరా
యసస్సు నీకు రూపమాయెరా
దాస్యాన జీవించడం కన్న చావెంతో మేలంది నీ పౌరుషం
మనుషులైతే మనం అనిచివేసే జులుం ఒప్పుకోకంది నీ ఉద్యమం
ఆలని బిడ్డని అమ్మని జన్మని బంధనాలన్ని ఒదిలి సాగుదాం
ఓ నువ్వే లక్షలై ఒకే లక్ష్యమై అటేవేయని ప్రతి పదం
కదనరంగమంతా (కదనరంగమంతా) కొదమసింగమల్లె (కొదమసింగమల్లె)
ఆక్రమించి (ఆక్రమించి) విక్రమించి (విక్రమించి) తరుముతోందిరా అరివీర సంహారా
హో సైరా హో సైరా హో సైరా హో సైరా హో సైరా హో సైరా
ఉసస్సు నీకు ఊపిరాయెరా