Elige una pista para reproducir
॥పల్లవి॥ చెలులలో నేను చేసినభాగ్య మెట్టిదో
వెలలేని వేడుకలు విభుఁడే యెఱుఁగునే
॥చ1॥ అందరికి మోహించిన అట్టే వుండుఁగాని యాతఁ
డందులో నాపై బత్తియై యుండుఁదాను
యిందరితో మాటలు తా నెన్నేసి ఆడినాను
కందువ నాతోనే ఆ కత లెల్లాఁ జెప్పునే
॥చ2॥ కొలువులో కాంతలఁ బైకొని కనుఁగొను గాని
తలఁపులో నన్నే చూచుఁదా నితఁడు
సెలవులఁ గొందరితో చేకొని నవ్వినాను
చలువల నాతోను సన్నలనే నవ్వునే
॥చ3॥ అచ్చలాన నెవ్వరిపై నైనాఁ జేయి వేసుఁగాని
కచ్చుపెట్టి నన్నే రతిఁ గౌఁగిలించునే
యిచ్చల శ్రీ వేంకటేశుఁడే నలమేలు మంగను
మచ్చిక నాపైఁ గలఁడు మన్నించునే నన్నును.