ధిరణన ధిరణన ధిరణన ధిరణన
ధినన ధినన ధినన ధినన ధినన
స గ మ ప గ ని స
స స ని గ మ గ మ ప
నేను గాలి గోపురం
నీవు ప్రేమ పావురం
వచ్చి వాలే ఈ క్షణం
నేను తెల్ల కాగితం
నీవు తేనె సంతకం
కోరుకున్నా ఈ దినం
ప్రేమకు దేవత నీవని తెలిసి
నా మది నీకొక కోవెల చేసా
ఓ ప్రియా... ఓ ప్రియా... ఓ ప్రియా
నేను గాలి గోపురం
నీవు ప్రేమ పావురం
వచ్చి వాలే ఈ క్షణం
మాఘమాస వేళాయే మంచు తెరలలోన
మధువణాల బాలా నీ పెదవులందుకోనా
పులకరింత పూజా ఈ పూట చేసుకోరా
కలవరింతలన్నీ నే కౌగిలించుకోనా
మాయో ఏమి మాయో
ఎంత హాయో ఈ బంధం
నీడో తోడు నీడో
నాకు నీవే జన్మాంతం
ఓ ప్రియా నా ప్రియా
యా యా నీ దానైపోయా
నేను గాలి గోపురం
నీవు ప్రేమ పావురం
వచ్చి వాలే ఈ క్షణం
నేను తెల్ల కాగితం
నీవు తేనె సంతకం
కోరుకున్నా ఈ దినం
ఈ వసంత వేళా
నీ వయసు పూలు పూసే
పూల గాలి నీలోనా
వలపు వేణువూదే
ప్రేమ మందిరాన కుడి కన్ను అదిరెనేల
పెళ్లి మండపాన కుడి కాలు పెట్టి రారా
నీవే నాకు నీవే సాగి రావే నా కోసం
దేవా ప్రేమ దేవా నీకు సేవే నా ప్రాణం
ఓ ప్రియా నా ప్రియా
యా యా నీవాన్నైపోయా
నేను గాలి గోపురం
నీవు ప్రేమ పావురం
వచ్చి వాలే ఈ క్షణం
నేను తెల్ల కాగితం
నీవు తేనె సంతకం
కోరుకున్న ఈ దినం
ప్రేమకు దేవత నీవని తెలిసి
నా మది నీకొక కోవెల చేసి
ఓ ప్రియా... ఓ ప్రియా... ఓ ప్రియా
నేను గాలి గోపురం
నీవు ప్రేమ పావురం
వచ్చి వాలే ఈ క్షణం