Выберите трек для воспроизведения
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానే తెలిసే
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానే తెలిసే
ఇదివరకు తెలియంది ఈ అనుభవం
ఎద మేలుకొలిపింది ఈ పరిచయం
ఓ ఓ ఓ ఓ ఓ (ఓ ఓ ఓ ఓ)
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
నీ కళ్ళ వాకిళ్ళలో తలుపు తెరిచేను ప్రేమ ప్రేమ
మొహాల ముంగిళ్ళలో వలపు కురిసేను ప్రేమ ప్రేమ
ఈనాడే తెలిసింది తొలిసారిగా ఎంత తీయంది ప్రేమని
ఆకాశ దీపాలు ఇలా చేరగా తేరా తీసింది ఆమని
ఇది సంగీతమో తోలి సంకేతమో
ఇది ప్రియగీతమో మధు జలపాతంలో
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించాక తెలిసే
మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానే తెలిసే
ఏనాడు ఏ దేవతో మనను కలిపినా వేళా వేళా
ఈనాడు ఈ దేవితో మనసు తెలిపెను చాలా చాలా
కాలాలు ఒకసారి ఆగలిలే మన తొలిప్రేమ సాక్షిగా
లోకాలు మన వెంట సాగలిలే మన ప్రేమికుల తోడుగా
ఇది ఆలాపనో మాది ఆరాధనో
మన సరసాలకే తొలి సంకీర్తనో
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించాక తెలిసే
మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానే తెలిసే
ఇదివరకు తెలియంది ఈ అనుభవం
ఎద మేలుకొలిపింది ఈ పరిచయం
ఓ ఓ ఓ ఓ ఓ (ఓ ఓ ఓ ఓ)
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించాక తెలిసే