Выберите трек для воспроизведения
ఎంతా మోసగాడివయ్యా శివ
నువ్వెంతా వేషగాడివయ్యా శివా
(ఎంతా మోసగాడివయ్యా శివ)
(నువ్వెంతా వేషగాడివయ్యా శివా)
బైటికేమో లింగ రూపమయ్యా శివా
బైటికేమో లింగ రూపమయ్యా శివ
నీకు లోపల శ్రీరంగ రూపమయ్యా శివా
ఎంతా మోసగాడివయ్యా శివ
నువ్వెంతా వేషగాడివయ్యా శివా
(ఎంతా మోసగాడివయ్యా శివ)
(నువ్వెంతా వేషగాడివయ్యా శివా)
పైన మూడు నామాలేనయ్యా శివా
పైన మూడు నామాలేనయ్యా శివ
నీకు లోన వేయి నామాలంటయ్యా శివా
ఎంతా మోసగాడివయ్యా శివ
నువ్వెంతా వేషగాడివయ్యా శివా
(ఎంతా మోసగాడివయ్యా శివ)
(నువ్వెంతా వేషగాడివయ్యా శివా)
పైపైనే అభిషేకాలయ్యా శివా
పైపైనే అభిషేకాలయ్యా శివ
నీకు అలంకారమంట లోపలయ్యా శివా
ఎంతా మోసగాడివయ్యా శివ
నువ్వెంతా వేషగాడివయ్యా శివా
(ఎంతా మోసగాడివయ్యా శివ)
(నువ్వెంతా వేషగాడివయ్యా శివా)
బైటికేమో తోలు బట్టలయ్యా శివా
బైటికేమో తోలు బట్టలయ్యా శివ
నీకు లోపల పీతాంబరాలయ్యా శివా
ఎంతా మోసగాడివయ్యా శివ
నువ్వెంతా వేషగాడివయ్యా శివా
(ఎంతా మోసగాడివయ్యా శివ)
(నువ్వెంతా వేషగాడివయ్యా శివా)
నెత్తిన గంగమ్మ తల్లయ్యా శివా
నెత్తిన గంగమ్మ తల్లయ్యా శివ
నీ కాల్ల కాడ పుట్టేనంటయ్యా శివా
ఎంతా మోసగాడివయ్యా శివ
నువ్వెంతా వేషగాడివయ్యా శివా
(ఎంతా మోసగాడివయ్యా శివ)
(నువ్వెంతా వేషగాడివయ్యా శివా)
వల్ల కాడే వైకుంఠమయ్యా శివా
వల్ల కాడే వైకుంఠమయ్యా శివ
నీకు కాలకూఠమే అమృతమయ్యా శివా
ఎంతా మోసగాడివయ్యా శివ
నువ్వెంతా వేషగాడివయ్యా శివా
(ఎంతా మోసగాడివయ్యా శివ)
(నువ్వెంతా వేషగాడివయ్యా శివా)
కడతేర్చేవాడ వీవెనయ్యా శివా
కడతేర్చేవాడ వీవెనయ్యా శివా
మమ్ము కాపాడేవాడ వీవెనయ్యా శివా
ఎంతా మోసగాడివయ్యా శివ
నువ్వెంతా వేషగాడివయ్యా శివా
(ఎంతా మోసగాడివయ్యా శివ)
(నువ్వెంతా వేషగాడివయ్యా శివా)
ఎంతా పిచ్చివాడవయ్యా శివా
ఎంతా పిచ్చివాడవయ్యా శివ
నువ్వెంత మంచి వాడివయ్యా శివా
ఎంతా పిచ్చివాడవయ్యా శివ
నువ్వంతా మంచి ఎంతెంతా మంచి
ఎంతెంతెంతా మంచి వాడివయ్యా శివా