కదిలానే నీవైపే నీరల్లే
నను నేనే వదిలేసి నీకై
కనుగొన్న తొలిసారి ఇవ్వాళే
కలగన్న నా తీరం నువ్వే
సందేహం లేదులే ఈ సమయం కలిసొచ్చిందిలే
సంతోషం రంగులే పరిచేసింది ప్రతి దారిలే
సందేహం లేదులే ఈ సమయం కలిసొచ్చిందిలే
సంతోషం రంగులే పరిచేసింది ప్రతి దారిలే
తొలి తొలి తొలి తొలకరి చినుకల్లే నే జారి
వదలను ఇక నిమిషము వరదల్లే నీ దారి
ఎదురుగా నిలవని ఒక మెరుపల్లే నే మారి
అడుగడుగున వెలుగై వస్తాలేదే వేరి
తెలుసా నీ వలనే నా వరసే మారిపోయో
మనసే నీ వశమై చేజారిపోయో
ఎపుడూ వినని సరికొత్త వింతగా
నా గుండెలో నీ వెగమే చేరింది చెప్పకుండా
నా ప్రతి స్వాసను తడిమే నీ గాలి గంధమే
ఇకపై నను బ్రతికించేటి ఓ ప్రాణ బంధమే
సందేహం లేదులే ఈ సమయం కలిసొచ్చిందిలే
సంతోషం రంగులే పరిచేసింది ప్రతి దారిలే
తొలి తొలి తొలి తొలకరి చినుకల్లే నే జారి
వదలను ఇక నిమిషము వరదల్లే నీ దారి
ఎదురుగా నిలవని ఒక మెరుపల్లే నే మారి
అడుగడుగున వెలుగై వస్తాలేదే వేరి
ఉదయం ఈ హృదయం నీ కొరకే మెలుకొందే
కనులు ఈ కలలు నీ సొంతమేలే
అవునా నిజమా అనిపిస్తు ఉన్నదే
ఆనందమే ఆకాశమై నా పైనా వాలుతుంటే
ఈ ప్రతి క్షణమొక వరమై నడిపింది కాలమే
బహుశా నిను కలపడమే తన ముందున్న ధ్యేయమే
సందేహం లేదులే ఈ సమయం కలిసొచ్చిందిలే
సంతోషం రంగులే పరిచేసింది ప్రతి దారిలే
తొలి తొలి తొలి తొలకరి చినుకల్లే నే జారి
వదలను ఇక నిమిషము వరదల్లే నీ దారి
ఎదురుగా నిలవని ఒక మెరుపల్లే నే మారి
అడుగడుగున వెలుగై వస్తాలేదే వేరి