Выберите трек для воспроизведения
ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వులవాన
ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వులవాన
ఏ నోము నోచినా ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగే వాడు బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే
ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వులవాన
ఆరేళ్ళ పాప కోసం ఆనాడు పాడినా
అపరంజి బొమ్మ కోసం ఈనాడు పాడినా
అభిమానమున్న వాన్ని అవమానపరచినా
ఎదలోని చీకటంతా వెన్నెలగా మార్చినా బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే
ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వులవాన
అనురాగ జీవితాన పెనుగాలి రేగినా
తనవారు కానరాక కనుపాప ఏడ్చినా
కడగళ్ళ బ్రతుకులోన వడగళ్ళు రాల్చినా
సుడిగుండమైన నావ ఏ దరికి చేర్చినా బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే
ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వులవాన
ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వులవాన
ఏ నోము నోచినా ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగే వాడు బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే