Выберите трек для воспроизведения
ఏమైనదో ఏమైనదో
పలుకు మరిచినట్టు పెదవికేమైనదో
ఏమైనదో ఏమైనదో
బరువు పెరిగినట్టు గుండెకేమైనదో
చుక్కలే మాయమైన నింగిలాగ
చినుకులే కురవలేని మబ్బులాగ
ఏమిటో ఏమిటో ఏమిటో
చూపెటో దారెటో నడకెటో
ఏమిటో ఏమిటో ఏమిటో
నువ్వెటో నేనెటో మనసెటో
ఏమైనదో ఏమైనదో
పలుకు మరిచినట్టు పెదవికేమైనదో
ఏమైనదో ఏమైనదో
బరువు పెరిగినట్టు గుండెకేమైనదో
వివరమంటూ లేని వింత వేధన
ఎవరితోటి చెప్పలేని యాతన
తలను వంచి తప్పుకెళ్లు తప్పే చేశానా
ఎంతమంది వచ్చి వెళ్లిపోయినా
నవ్వులేగా వీడుకోలు అంచున
ఇంత గుచ్చలేదు నన్ను ఏ పరిచయమైనా
నీకు నచ్చినట్టు నేనుంటున్నా
ఎందుకంటే చెప్పలేనంటున్నా
అర్థమవదు నాకు ఇంతగ మారానా
కాలమే కదలనన్న క్షణములాగ
ఎన్నడూ తిరిగిరాని నిన్నలాగ
ఏమిటో ఏమిటో ఏమిటో
చూపెటో దారెటో నడకెటో
ఏమిటో ఏమిటో ఏమిటో
నువ్వెటో నేనెటో మనసెటో