Выберите трек для воспроизведения
బ్రతికెద నీ కోసమే
నా ఊపిరి నీ ధ్యానమే
నా జీవితమే నీకంకితమై
నా జీవితమే నీకంకితమై
నీదు సేవ జేతు పుణ్యమని బావింతు
నేను చివర శ్వాస వరకు
బ్రతికెద నీ కోసమే
స్వామి నే బ్రతికెద నీ కోసమే
శ్రమయును బాధయు నాకు కలిగినా
వైరులు ఎల్లరు నన్ను చుట్టినా
నీదు న్యాయ శాసనమునే పాటింతు
శ్రమయును బాధయు నాకు కలిగినా
వైరులు ఎల్లరు నన్ను చుట్టినా
నీదు న్యాయ శాసనమునే పాటింతు
నాలోని బలము నన్ను విడిచినా
నా కన్ను దృష్టి తప్పిపోయినా
నాలోని బలము నన్ను విడిచినా
నా కన్ను దృష్టి తప్పిపోయినా
నిన్ను చేరి నీదు శక్తి పొంద
నీదు ఆత్మ తోడ లోక రక్షకా
బ్రతికెద నీ కోసమే
నా ఊపిరి నీ ధ్యానమే
వాక్యమే మ్రోగుట
విశ్వాసము వెల్లడి చేయుట
ఇహ మందున యోగ్యమైన
కార్యముగా నే తలచి
వాక్యమే మ్రోగుట
విశ్వాసము వెల్లడి చేయుట
ఇహ మందున యోగ్యమైన
కార్యముగా నే తలచి
నీదు రుధిరంబు చేత నేను
కడగబడిన నీదు సొత్తు కాదా
నీదు రుధిరంబు చేత నేను
కడగబడిన నీదు సొత్తు కాదా
నిన్ను జూప లోకంబులోన
నీదు వెలుగు దీపముగా నాథా
బ్రతికెద నీ కోసమే
నా ఊపిరి నీ ధ్యానమే
నా జీవితమే నీకంకితమై
నా జీవితమే నీకంకితమై
నీదు సేవ జేతు పుణ్యమని బావింతు
నేను చివర శ్వాస వరకు
బ్రతికెద నీ కోసమే
స్వామి నే బ్రతికెద నీ కోసమే