Выберите трек для воспроизведения
జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా
ఆహా ఏమి హాయిలే హలా
జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా
ఆహా ఏమి హాయిలే హలా
లలలలా లలలలా హహహహ ఊఊ
ఉన్నది పగలైనా అహ వెన్నెల కురిసేనే
ఓ ఓ ఓ ఓ
ఉన్నది పగలైనా అహ వెన్నెల కురిసేనే
అహ వన్నె చిన్నెల కన్నె మనసులో సన్న వలపు విరిసే
అహ వన్నె చిన్నెల కన్నె మనసులో సన్న వలపు విరిసే
జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా
ఆహా ఏమి హాయిలే హలా
తీయని రాగమెదో మది హాయిగ పాడెనే
అహ అహ అహ
తీయని రాగమెదో మది హాయిగ పాడెనే
తరుణ కాలమేలే అది వరుని కొరకు పిలుపే
తరుణ కాలమేలే అది వరుని కొరకు పిలుపే
అది వరుని కొరకు పిలుపే
జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా
ఆహా ఏమి హాయిలే హలా
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు