Выберите трек для воспроизведения
Сингл / Трек
మాయే చేసి మెల్లగా
మది దోచేసిందే సిన్నగా
చూపే చూసి సన్నగా
నను చంపేసిందే సూటిగా
ఒక నవ్వే నవ్వి నేరుగా
గుండెలనె పిండేసిందిగా
తన పేరే వింటే చాలుగా
తనువంతా పులకించేనుగా
ఏదో అయ్యిందిలే
గుండె ఝల్లిందిలే
ఒయ్ పిల్లా నీవల్లే
మాయే చేసి మెల్లగా
మది దోచేసిందే సిన్నగా
చూపే చూసి సన్నగా
నను చంపేసిందే సూటిగా
నే ముందు మునుపులా లేనుగా
రోజు రోజుకి కొత్తగా
నా తీరుతెన్నులే మారుతున్నవే
నాకు తెలియకుండా
ఆ నిండువెన్నెలే సాక్షిగా
జాబిలమ్మనే చాటుగా
నే చూడడానికే వేచి ఉన్ననే
నిండు రేయి పగలు
పద పద పద పదమని పాదం
నీవైపే లాగిందే
రేయి గడవదులే
కలలొదలవులే
ఈ వలపే నీ వలనే
ఒక నవ్వే నవ్వి నేరుగా
గుండెలనె పిండేసిందిగా
తన పేరే వింటే చాలుగా
తనువంతా పులకించేనుగా
ఏదో అయ్యిందిలే
గుండె ఝల్లిందిలే
ఒయ్ పిల్లా నీవల్లే
మాయే చేసి మెల్లగా
మది దోచేసిందే సిన్నగా
చూపే చూసి సన్నగా
నను చంపేసిందే సూటిగా
ఈ అల్లరేమిటో వింతగా
గుండె లోపలే చేరగా
ఈ రూపురేఖలే కళ్ళ లోపలే
నిండి పోయినాయే
ఆ నీలిమేఘమే తోడుగా
వెంట వచ్చెనే నీడగా
నే ఉన్నపాటుగా ఎందుకో ఇలా మారిపోయినానే
అరె అరె అరె అరె రామా
ఏమైందో ఈ వేళా
ఎద కదిలెనులే
కధ మొదలయెనే
నీ తలపే ఎందుకిలా
ఒక నవ్వే నవ్వి నేరుగా
గుండెలనె పిండేసిందిగా
తన పేరే వింటే చాలుగా
తనువంతా పులకించేనుగా
ఏదో అయ్యిందిలే
గుండె ఝల్లిందిలే
ఒయ్ పిల్లా నీవల్లే
మాయే చేసి మెల్లగా
మది దోచేసిందే సిన్నగా
చూపే చూసి సన్నగా
నను చంపేసిందే సూటిగా