Выберите трек для воспроизведения
జనక్ జనక్ జగ జంతర్ మంతర్
మచక్ మచక్ మన మస్తు కలందర్
నిన్ననేది ఒక vest paper-u
నేడనేది ఒక news paper-u
రేపనేది ఒక question paper-u
సరిగ life-ను చదవనే చదవక
Answer-u తెలియక
అడుగులు కదలక
తికమక మకతిక పడిపోవద్దే
పకపక నవ్వుల joker
భయ్యా నీదో వేషం నాదో వేషం
Makeup తోనే పుట్టేసాం
ఇది జీవిత నాటక రంగం
నువ్వు నేను కన్నులు తెరిచేలోపే
తెర లేచింది లేచేస్తాం
కథ ముందుకు కోనసాగిద్దాం
మనను ఆటాడించే దర్శకుడైనా
అభినందించే ప్రేచకుడైనా
ఒకడే ఒక్కడు ఇంకెవడు ఆ పైవాడు
వాడూ కనపడకుండా దాకుంటాడు
అయినా అన్నీ చూస్తుంటాడు
చూసిన దానికి మార్కులు వేస్తూ ఉంటాడు
నీ పాత్రను సరిగా పోషించావో super
కొంచం తడబడ్డావో అయిపోతావు joker
నీ పాత్రను సరిగా పోషించావో super
కొంచం తడబడ్డావో అయిపోతావు joker
కనులు మూసి తెరిచేలోగా
కదిలిపోయే కాలమిది
మొదలు చివర అన్నీ ముందే
నిర్ణయించిన ఆట ఇది
మనకు దొరికిన పాత్రలోనే
ఒదిగి పోవాలి
విధి విధించిన బాధ్యతలను తీర్చుకోవాలి
అమ్మా నాన్న కనిపెంచిన తనువు ఇది
అంతో ఇంతో అనురాగపు ఋణముంది
జన్మపంచిన ప్రేమకే నువు
ప్రేమ పంచాలి
నీ పద్ధతి నువ్వు పాటించావో super
కొంచం తడబడ్డావో అయిపోతావు joker
నీ పద్ధతి నువ్వు పాటించావో super
కొంచం తడబడ్డావో అయిపోతావు joker
మనసు పడితే దొరికేదేనా
మనది కానిది ఏదైనా
మలుపు చూడక కదిలేదేనా
మనిషి బ్రతుకులో అడుగైనా
కంటిముందే కోరుకుంది దూరమౌతున్నా
పంటి బిగువున ఓర్చుకోరా గుండె కోతైనా
శాపం తాపం నీ నటనలో భాగమని
వేశే వేషం కొనసాగక తప్పదని
చివరిదాకా ఓడిపోనీ ఆటసాగాలి
ఆ దేవుడు మెచ్చే ఆటాడావో super
కొంచం తడబడ్డావో అయిపోతావు joker
ఆ దేవుడు మెచ్చే ఆటాడావో super
కొంచం తడబడ్డావో అయిపోతావు joker