Выберите трек для воспроизведения
చెప్పలేని ఆనందం హోయ్
గుప్పుమంది గుండెలోనా
అందమైన దేవలోకం
నెలమీద పోల్చుకున్నా
పెదవుల్లో చిరునవ్వై మెరిసే హోలీ
ఎదపండే వెలుగల్లే తొలి దీవాళి
కలిసింది నీలా దీపాళి
దీపాళి దీపాళి
చెప్పలేని ఆనందం
గుప్పుమంది గుండెలోనా
మనలోకం మనదంటూ ఒదిగుంటే ఎవరికీ వారే
జగమంత మనవారే అనుకుంటే పనులే లేవే
ఒకటే కొమ్మ పూవులూ ఎన్నో
ఒకటే సంద్రం అలలెన్నో
అడుగడుగూ మన ప్రాణం అందరికోసం
నలుగురిలో చూడాలి మన సంతోషం
ఈ మాటకు రూపం దీపాళి
దీపాళి దీపాళి
చెప్పలేని ఆనందం
గుప్పుమంది గుండెలోనా
ప్రియమైన బంధం లా పిలిచింది నన్ను చోటు
ఇటుగానే వచ్చాకే తెలిసింది నాలో లోటు
చూడని కల నిజమై ఇలా
మార్చేసింది నన్ను నీలా
అరే నిన్నా అటు మోన్నా వరసేమన్నా
ఇకపైన ప్రతి అడుగు నీ జతలోనా
అని నీతో రానా దీపాళి
దీపాళి (దీపాళి)
హూ దీపాళి (దీపాళి)