Выберите трек для воспроизведения
ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరిచిపోయా మాయలో
ప్రాణమంతా మీటుతుంటే వానవీణలా
ఎదుట నిలిచింది చూడు
నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి
కలే అయితే ఆ నిజం ఎలా తట్టుకోవాలి
అవునో కాదో అడగకుంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా
ఎదుట నిలిచింది చూడు
నిన్నే చేరుకోలేక ఎటెళ్లిందో నా లేఖ
వినేవారు లేక విసుక్కుంది నా కేక
నీదో కాదో వ్రాసున్న చిరునామా
ఉందో లేదో ఆ చోట నా ప్రేమా
వరంలాంటి శాపమేదో సొంతమైందిలా
ఎదుట నిలిచింది చూడు
జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడుచినుకంటి చిన్నదేమో
మైమరిచిపోయా మాయలో
ప్రాణమంతా మీటుతుంటే వానవీణలా
ఎదుట నిలిచింది చూడు