
అనగనగనగా మనసున మెరుపే
మెరిసిన తరుణంలో
మెరుపుల వెనక చిరు చిరు చినుకే
కురిసిన సమయంలో
మెరుపు వెలుగులతో చినుకు పిలుపులతో
తెరవని తలుపులు తెరిచిన క్షణమున
ధీం తార ధిరనా
తక ధీంతతార ధిరనా
కొత్త ప్రేమ తపనా
మొలకెత్తె ఎందువలనా
తెలిసిన కథలో కలసిన తిధిలో
తిరగని మలుపులు తిరిగిన క్షణమున
ధీం తార ధిరనా
తక ధీంతతార ధిరనా
పిచ్చి ప్రేమ తపనా
పురి విప్పె ఇందు వలనా
కుంకుమ పువ్వుకు కాటుక రేఖవనా
కోరిన ప్రియునికి కొగిలి లేఖవనా
నీలి నింగిని వదిలి ఆరలిటు కదిలీ
చేరుకున్నది మజిలీ
నీ చిలిపి పెన్నిది తగిలీ
జిలిబిలి తారా ఎదగగ నమునా
జాబిలి తీరుగ ఎదిగిన క్షణమున
ధీం తార ధిరనా
తక ధీంతతార ధిరనా
పిచ్చి ప్రేమ తపనా
పురి విప్పె ఇందు వలనా
నచ్చిన చేతికి గోరింటాకవనా
నల్లని రేయికి వెన్నెల పడకవనా
కొద్దిగా ఇటు జరిగి
ముద్దులో మునిగి
నవ్వవా అటు తిరిగి
నేనివ్వలేనిది అడిగి
అడుగులు కదిపి నడుమును కొలిచి
నడవని దారిన నడిచిన క్షణమున
ధీం తార ధిరనా
తక ధీంతతార ధిరనా
పిచ్చి ప్రేమ తపనా
పురి విప్పె ఇందు వలనా
అనగనగనగా మనసున మెరుపే
మెరిసిన తరుణంలో
మెరుపుల వెనక చిరు చిరు చినుకే
కురిసిన సమయంలో
మెరుపు వెలుగులతో చినుకు పిలుపులతో
తెరవని తలుపులు తెరిచిన క్షణమున
ధీం తార ధిరనా
తక ధీంతతార ధిరనా
ధీం తార ధిరనా
తక ధీంతతార ధిరనా
ధీం తార ధిరనా
తక ధీంతతార ధిరనా
ధీం తార ధిరనా
తక ధీంతతార ధిరనా