Выберите трек для воспроизведения

వద్దన్నా గుండెల్లో దాచే ప్రేమ ఎంతున్నా అర్ధం ఉందా
నాదంటే నాదంటూ చూపే ప్రేమ ఏమైనా చేయిస్తుందా
ప్రాణాలే ప్రాణంగా ఇచ్చే ప్రేమ ఇష్టాలే తగ్గించిందా
వేచున్నా రాకుండా పోయే ప్రేమ శాపంలా తిరిగొచ్చిందా
ఏ గుండెలో ఏమున్నదో
తీరేదెలా బాధే
ఈ లోపలే ఏమైనదో
ఆ కాలమే రాదే
పో పోవే, పో పోవే, పోవే ప్రేమ
ప్రేమంటే త్యాగం కదా
పో పోవే, పో పోవే, పోవే ప్రేమ
ప్రేముంటే రాజీ కాదా
మాయేనే మనసే
మారేలే మనిషే
మోసాలు చేసేనులే
ఆగింది మనసే
ఇలా తాను కలిసే
ఈ బాధ పేరేమిటే అర్ధం కాదే
పో పోవే, పో పోవే, పోవే ప్రేమ
ప్రేమంటే త్యాగం కదా
పో పోవే, పో పోవే, పోవే ప్రేమ
ప్రేముంటే రాజీ కాదా