Сингл / Трек
దేవి కళ్యాణ వైభోగమే
నాధ కళ్యాణ వైభోగమే
సీత కళ్యాణ వైభోగమే
రామ కళ్యాణ వైభోగమే
నీల మేఘ శ్యామ రామ సుందరం
సీతాపతి రామ ప్రేమ మందిరం
మోహనాంగ రఘువంశ కులధామా
మృదువదనా చంద్రకిరణా
సన్నాయి మేళాలు మోగినవే
అమ్మాయి నవ్వుల్లో చేరినవే
ఆకాశమే నేడు తారలనే
అక్షింతలై పైన జల్లినదే
కలలు నిజమై రాసి పెట్టగా
ఎదురు బదురు చేరినట్టుగా
మనసు పడుతూ తాళి కట్టగా
ఒకరి ఒకరై ఇక మారి జంటగా
అడుగుల్లో అడుగేసి సాగదుగా తుంటరీ కృష్ణుడు
బ్రతిమాలి అడిగితే చాలు కదా ప్రాణమై రుక్మిణీ
పులిహోర పరమాన్నం
పిలిచాయి పదమంటూ
కడుపార విందారగించి బయలుదేరగా
సన్నాయి మేళాలు మోగినవే
అమ్మాయి నవ్వుల్లో చేరినవే
ఆకాశమే నేడు తారలనే
అక్షింతలై పైన జల్లినదే
కలలు నిజమై రాసి పెట్టగా
ఎదురు బదురు చేరినట్టుగా
మనసు పడుతూ తాళి కట్టగా
ఒకరి ఒకరై ఇక మారి జంటగా
కలలు నిజమై రాసి పెట్టగా
సన్నాయి మేళాలు మోగినవే
ఎదురు బదురు చేరినట్టుగా
అమ్మాయి నవ్వుల్లో చేరినవే
మనసు పడుతూ తాళి కట్టగా
ఆకాశమే నేడు తారలనే
ఒకరి ఒకరై ఇక మారి జంటగా
అక్షింతలై పైన జల్లినదే