Выберите трек для воспроизведения
ఏమిటేమిటో ఏం అవుతున్నదో
ఏటవాలు దారిలో జారేదెక్కడికో
ఏమిటేమిటేమిటో ఏం కానున్నదో
ఏరులాంటి వయసులో చేరేదే తటికో
తెలుసా తెలుసా నీకైనా
తెలుసా తెలుసా మరి నాకైనా
అయినా అడుగులు ఆగేనా
వెళదాం ఏదేమైనా
ఎదురుగ నువ్వు నిలబడు నిముషాన
ఎదిగిన ప్రతి క్షణముని మరిచానా
తొలి తరగతి తలుపులు తెరిచానా
నిజమా నిజమా
నీ రాకతో నా రాతలో
ఒక్కరోజులోనే ఎన్నెన్ని మారాయలా
ఆ నింగినే నా లేఖగా మార్చుకున్న చాలదేమో అవన్నీ నే రాయాలంటే
చెబుతా అన్నీ నీతోన
చెబుతా రోజూ మరి రాత్రైనా
అయినా కబురులు ముగిసేనా
కలలో మళ్ళీ రానా
ఎదురుగ నువ్వు నిలబడు నిముషాన
ఎదిగిన ప్రతి క్షణముని మరిచానా
తొలి తరగతి తలుపులు తెరిచానా
నిజమా నిజమా