Выберите трек для воспроизведения

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనొ ఆనాడే తెలిసిందది
ఆవేశం ఏనాడు కలిగెనొ ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఏ పువ్వు ఏ మోవిదన్నది ఏ నాడో రాసున్నది
ఏ ముద్దు ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నది
బంధాలై పెన వేయు వయసుకు ఆందాలే దాసోహమనగ
మందారం విరబూయు పెదవులు మధువులనే చవి చుడమనగ
పరువాలే ప్రణయాలై స్వప్నాలే స్వర్గాలై
ఎన్నేన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలరెను
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనొ ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిద
ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తునో
ఏ రాగం ఏ గుండె లోతున ఏ గీతం పలికించునో
హృదయాలే తెర తీసి తనువుల కలబోసి మరపించమనగ
కౌగిలిలో చెర వేసి మదనుని కరిగించి గెలిపించ మనగ
మోహాలే దాహాలై సరసాలే సరదాలై
కాలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలి వెలలేని విలువలు
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనొ ఆనాడే తెలిసిందది
ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల