Выберите трек для воспроизведения
ఇంతే ప్రేమ ఇంతే ప్రేమ
అంతే చిక్కదే
ఎంతో కొంత అర్థం కాక
ఏదీ చెప్పదే
కళ్లనే నీటి దీపం చేసి
లోకం చూపించి
గుండెకే చిన్ని దారం కట్టి
ఊహల్లో ముంచేసి
తనతో తనకే యుద్ధం ఏమిటో
ఇంతే ప్రేమ ఇంతే ప్రేమ
అంతే చిక్కదే
ఎంతో కొంత అర్థం కాక
ఏదీ చెప్పదే
అరుదుగ దొరికిన వరమని తెలిసినా
ఎవరికి ఎవరనీ ఎద అడిగే
పలకని మాటలే
పలుపలు విధములా
తెలిపెను తియ్యని కబురులనే
ఇన్నాళ్లుగా నే చూసిన ప్రేమే ఇదా
ఆ ప్రేమనే ప్రశ్నించనా లాభం లేదా
తనుగా మిగిలి నే ఒంటరినయ్యానా
ఇంతే ప్రేమ ఇంతే ప్రేమ
అంతే చిక్కదే
ఎంతో కొంత అర్థం కాక
ఏదీ చెప్పదే