Выберите трек для воспроизведения
చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా
చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మా ఎట్టాగైనా
చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా
షోలే ఉందా
ఇదిగో ఇందా
చాల్లే ఇది జ్వాల కాదా
తెలుగులో తీసారే బాల
ఖైదీ ఉందా
ఇదిగో ఇందా
ఖైదీ కన్నయ్య కాదే
వీడికి అన్నయ్య వాడే
జగదేకవీరుని కథ ఇది పాత పిక్చరు కదా
అతిలోక సుందరి తల అతికించి ఇస్తా పదా
ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి
చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా
ఒకటా రెండా పదులా వందా
బాకీ ఎగవేయకుండా బదులే తీర్చేది ఉందా
మెదడే ఉందా మతి పోయిందా
చాల్లే మీ కాకి గోల వేళా పాళంటు లేదా
ఏమైంది భాగ్యం కథ
కదిలిందా లేదా కథ
వ్రతమేదో చేస్తుందట
అందాక ఆగాలట
లౌక్యంగా బ్రతకాలి సౌఖ్యాలే పొందాలి
చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను
వస్తానమ్మా ఎట్టాగైనా
చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా