ఒక నువ్వు చాలు చెళి పువ్వుల మాసం
నవ్వు రంగు పలుముఖోదా నా ప్రతి నిమిషం
ఒక్క జన్మ చాలదు లే నీ సహవాసం
మళ్ళీ మళ్ళీ జన్మిస్తా నీ జత కోసం
నువ్వు నా దైవం పంపిన ప్రియ సందేశం
నిండుగా నీలో ఉన్నది నా సంతోషం
పాపలా చూసుకుంటా కంటి రెప్పలో దాచుకుంటా
రావే నువ్వు నా రాణివంటా
నీకే అంకితం ఊపిరంతా చివరంతా
తేనెక్కళ్ళ చూపులతో మాయ చేసావే
హాయిహాయి ఊహలలో ఊయలేసావే
అయువున్నధెందుకని గుర్తు చేసావే
ఆనందాల అంచున మన పేర్లు రాశావే
నువ్వులా పక్కన ఉంటే చాలు కడవరకు
క్షణమో అద్భుతమంటూ సాగిపోదా బ్రతుకు
పాపలా చూసుకుంటా కంటి రెప్పలో దాచుకుంటా
రావే నువ్వు నా రాణివంటా నీకే అంకితం
ఊపిరంతా చివరంతా
నా జన్మకే అందం నీయతో అనుబంధం
నీ మనసులో భాగం నే పొందిన యోగం
ఎండ వేడినంతా నేనే స్వీకరిస్తానే
చందనాల జల్లూ నీపైన చిలకరిస్తానే
కాలమంతా నీ కొరకే కలలు కంటానే
లోకమంతా ఏకమై నను నీతోనే
చూపులో నీ ముఖచిత్రం ముద్రించుకున్ననే
నీ చుట్టు ఆశల స్వర్గం నిర్మించుకున్ననే
పాపలా చూసుకుంటా కంటి రెప్పలో దాచుకుంటా
రావే నువ్వు నా రాణివంటా నీకే అంకితం
ఊపిరంతా చివరంతా