పిల్లో పిసినారి పిల్లో ఓ ముద్దియ్యరాదే పిల్లా
పిల్లో పిసినారి పిల్లో ఓ ముద్దియ్యరాదే పిల్లా
పిల్లో పిసినారి పిల్లో ఓ ముద్దియ్యరాదే పిల్లా
ఓసారి నువ్వే ఒళ్ళోకి వస్తే తరుగేమి అవుతాదే నీ తాత ముల్లె
బావో అయ్యో బావో ఓ బావో బద్మాషు బావో నీ ఏషాలు నాకాడగావో
బావో బద్మాషు బావో నీ ఏషాలు నాకాడగావో
సందిస్తె వస్తావు నా ఎంట పడతావు సందేళ సీమల్లే కుట్టేసిపోతావు
పిల్లో ఓ పిల్లో (బావో బావా)
పున్నాల ఎన్నెలలోన తానాలు ఆడేటి యేల ఆ సున్ని పిండల్లే జాణా నీ ఒళ్ళు నేనంటుకోనా
జల్లల్లె సల్లంగ మొన్న రొయ్యల్లె సెయ్యెట్టి నిన్న గిల్లితె నా బుగ్గ పైనా అల్లాడిపోతిని కానా
రాగాల నావ నువ్వయితే నీకు రంగేళి తెరసాప కానా
రాకయ్యో మీద పడకయ్యో కోరమీసాల సొరచేప లాగా
వయ్యారి కడవా ఓ పూల పడవా
వలయేస్తే పరిగల్లె నా ఒళ్ళో పడవా
బావో అయ్యో బావో ఓ బావో బద్మాషు బావో నీ ఏషాలు నాకాడగావో
హా పిల్లో పిసినారి పిల్లో ఓ ముద్దియ్యరాదే పిల్లా
హైలెస్సా కెరటాల మీన తెలతెల్ల నురగల్లె రానా
లేలేత కలువాలు అయినా నీ పాదాలు ముద్దాడుకోనా
హాహాహా ముద్దాస ఎరవేస్తు వున్నా బుద్దింక ఎరగానిదైనా
సిన్నారి సిరపక్కెనేనా నీ గాలంకి నే చిక్కుతానా
ఎందుకే కన్ను గీటితే బెదురు పీతల్లే దూరేవు కలుగూ
ఒంటిగా సేత సిక్కితే పైడి ఒంటికి పెడతావు నలుగూ
నువ్వొప్పుకున్నా తప్పించుకున్నా నీ కొప్పు పూనేనే కొరమీనకూన
బావో అయ్యో బావో ఓ బావో సింగారి బావో నీ మనసే బంగారం లేవో
హెయ్ బావో సింగారి బావో నీ మనసే బంగారం లేవో
బావో సింగారి బావో నీ మనసే బంగారం లేవో
ఓ తాళి కడితే నీ దాన్ని అవుతా మనువాడి నీకే ముద్దిచ్చుకుంటా
పిల్లో ఓ పిల్లో (ఎయ్ బావో బావా)
బావ ఆహ బావోయ్ ఓహొ బావ బావ హ హ హా( ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్ల)