Выберите трек для воспроизведения
రామ రామ రామా నీలి మేఘశ్యామ
(స సనిపనిసా)
రామ రామ రామా నీలి మేఘశ్యామ
రావా రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ
ఆ మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే
కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే
నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా
రెప్పలు మూయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా
రామ... రామ
రామ రామ రామా నీలి మేఘశ్యామ
రావా రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ