మనసున ఉన్నదీ చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా
మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా
ఒకసారి దరి చేరి యద గొడవేమిటో తెలపకపోతే ఎలా
మనసున ఉన్నదీ చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా
చింత నిప్పైన చల్లగ ఉందనీ ఎంత నొప్పైన తెలియలేదనీ తననే తలచుకునే వేడిలో
ప్రేమ అంటేనే తియ్యని బాధని లేత గుండెల్లో కొండంత బరువనీ కొత్తగా తెలుసుకునే వేళలో
కనబడుతోందా నా ప్రీయమైన నీకు నా యద కోత అని అడగాలనీ
అనుకుంటు తన చుట్టు మరి తిరిగిందనీ తెలపకపోతే ఎలా
మనసున ఉన్నదీ చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా
నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి నాకింక చోటెక్కడుందని నిదరే కసురుకొనే రేయిలో
మేలుకున్నాయి లే వింత కైపని వేల ఊహల్లో ఊరేగు చూపుని కలలే ముసురుకునే హాయిలో
వినబడుతోందా నా ప్రియమైన నీకు ఆశల రాగం అని అడగాలనీ
పగలేదో రేయేదో గురుతే లేదనీ తెలపకపోతే ఎలా
మనసున ఉన్నదీ చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా
మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా
ఒకసారి దరి చేరి యద గొడవేమిటో తెలపకపోతే ఎలా
ల ల ల లా ల ల ల లా ల ల ల లా ల ల ల లా ల ల ల లా ల ల