Оберіть трек для відтворення
ఆరారో ఆరిరరో ఆరారే రారో ఆరారో ఆరిరరో ఆరో ఆరో ఆరారో
ఆరారో ఆరిరరో ఆరారే రారో ఆరారో ఆరిరరో ఆరో ఆరో ఆరారో
తననే తొలిచే మనుషులకే దాహం తీర్చు నేల గుణం
తననే విరిచె చేతులకే నీడై కాచే చెట్టు గణం
తననే తుంచే గాలులకే గంధం పూసే పూలవనం
తననే ఒలిచే ఉలి దెబ్బలకే శిల్పం ఇచ్చే రాయితనం
మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదు లే
మన్నించే హృదయానికి ఏ బాధ రాదు లే
మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదు లే
మన్నించే హృదయానికి ఏ బాధ రాదు లే
ఆరారో ఆరిరరో ఆరారే రారో ఆరారో ఆరిరరో ఆరో ఆరో ఆరారో
కారడవిని కాల్చే చిచ్చువు కావా పగతో ఉంటె నిత్యం
ఆ వేడిని దాటి వెలుగువు కావా మన్నిస్తే కొంచం
పడి తడబడుతూనే పొరబడుతూనే నేర్చే మనుషుల నైజం
ప్రతి తప్పును పగతో దండిస్తే ఇక మిగిలేది శూన్యం
ఏ నేరం ఎరుగని ఆకులను కన్నీరుగా రాల్చే కాలం
మళ్ళి తొలి చిగురులు ఇచ్చి మాన్పేస్తుంది తను చేసిన గాయం
మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదు లే
మన్నించే హృదయానికి ఏ బాధ రాదు లే
మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదు లే
మన్నించే హృదయానికి ఏ బాధ రాదు లే
ఆరారో ఆరిరరో ఆరారే రారో ఆరారో ఆరిరరో ఆరో ఆరో ఆరారో
ఒక ఏనుగు కరిషం వేడిని చూసి వెళ్ళిన దూరం చెబుతా
పులి వేసిన జాడల లోతును కొలిచి బరువెంతో చెబుతా
ఒక్క నక్కే వేసే ఊలను వింటూ ఆకలి ఎంతో చెబుతా
తూనీగలు ఎగిరే వేగం తో వర్షం వైనం చెబుతా
ఒక చిన్న అలికిడితోనె అడవంతా కనిపెడతానే
బిడ్డ నీ మనసును మాత్రం అంతే చిక్కక వేతికేస్తున్నానే
మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదు లే
మన్నించే హృదయానికి ఏ బాధ రాదు లే
మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదు లే
మన్నించే హృదయానికి ఏ బాధ రాదు లే
ఆరారో ఆరిరరో ఆరారే రారో ఆరారో ఆరిరరో ఆరో ఆరో ఆరారో