Оберіть трек для відтворення
బుగ్గల్లోన భూకంపం
ఒళ్లంతా చలి రంపం
బుగ్గల్లోన భూకంపం
ఒళ్లంతా చలి రంపం
నువ్వు తాకితే తీగ లాగితే
నరనరాన్నిలా వీణ మీటితే
మరుడా మన్మధ గురుడా
మొదలయ్యిందేదో తేడా
నా తలపుల్లోన తలగడ పైన
నీదేరా నీడ
బుగ్గల్లోన భూకంపం
ఒళ్లంతా చలి రంపం
నీలాగుండే మగవాడే నాక్కావాలంటూ కలగన్నా
తీరా నువ్వే ఎదురొస్తున్నా
ఏంటో కంగారవుతున్నా
గిచ్చెయ్యండి గిలిగింతయ్యే మాయాజాలం చూస్తూన్నా
రంగులు మారే బంగారంలా
నీకే నిను చూపిస్తున్నా
అమ్మో నీ వల్లేనా అమ్మాయైపోతున్నా
అందం అందిస్తూనే హైరానా పడుతున్నా
చెయ్యారా లాలిస్తూ నీ బిడియాన్ని
పక్కకు నెడుతున్నా
కలిసేదాక నాలో ఉంది
నువ్వేనంటూ తెలియదుగా
కన్నులు మూసి గుండెల్లోకి
ఎపుడొచ్చావో అల్లరిగా
ఇదిగో చూడు వచ్చానంటూ
ప్రేమే నీకు చెప్పదుగా
తనకై తాను కనిపించందే
ఏ మనసు గుర్తించదుగా
అంటే నేనిన్నాళ్లు నాలో నిను మోసానా
నువ్వేంటో తెలియందే నీతో గడిపేశానా
నువ్ నేను పుట్టక ముందే
ఈ బంధం కలిసిందే మైనా
బుగ్గల్లోన భూకంపం
ఒళ్లంతా చలి రంపం
నువ్వు తాకితే తీగ లాగితే
నరనరాన్నిలా వీణ మీటితే
మరుడా మన్మధ గురుడా
మొదలయ్యిందేదో తేడా
నా తలపుల్లోన తలగడ పైన
నీదేరా నీడ