Оберіть трек для відтворення
నా కంటిపాపల్లో గలగలా
కావేరి పొంగె నీ లేఖ వల్ల
నా మనసు లోతుల్లో ఇపుడిలా
మాగాణి పండె నీ రాత వల్ల
చదివిన అక్షరాలన్నీ పెదవికి నవ్వు నేర్పాయే
చలిచలిగాలుల్లో వేసంగి పూలే లోన పూచాయే
ఎపుడో నిన్ను చూసే రోజు
ఎపుడో అన్నదీ ప్రాణం
అపుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం
ఎపుడో నిన్ను చూసే రోజు
ఎపుడో అన్నదీ ప్రాణం
అపుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం
నీకంత ఇష్టం పెరిగేటంతలా
నేనేమి చేశా తెలియదే
నేన్నీకు సొంతం అనిపించేంతలా
ఏ మేలు చేశా తెలుపవే
అసలొక ఆచూకీ వదలవే నా పైకి
పరుగున ఈ రోజే నీకేసి రానా కొండలే దూకి
ఎపుడో నిన్ను చూసే రోజు
ఎపుడో అన్నదీ ప్రాణం
అపుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం
ఎపుడో నిన్ను చూసే రోజు
ఎపుడో అన్నదీ ప్రాణం
అపుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం