Оберіть трек для відтворення
మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా
మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా
పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా
జిగిబిగి సొగసందిస్తే ఈ జగతిని బదులిస్తా
ప్రియతమ పదవందిస్తే ఆ పుడమిని ఎదురిస్తా
దా దా దా దా ఆ
పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా
మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా
కళ్ళతోటి కావలిస్తే కాళిదాసు నవలిస్తా
ఎదకు ఎదురు పడితే ఆ పెదవి పొదిగి పెడతా
కొంగుముడి చేరువొస్తే కోహినూరు కొసరిస్తా
నడక మిడిసి పడితే ఓ నడుము మడత ముడతా
కృష్ణయ్యలా వెన్నంటితే
నా సన్ననీ చెల్లించునా
వనితా విను చెబుతా కథ ఆ
మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా
పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా
రాజులాగ రాజుకుంటే వైజయంతి మాలేస్తా
గడియ గడువు పెడితే ఆ తడిసి కడివెడవుతా
సాగరంలా కమ్ముకుంటే బ్రహ్మపుత్ర నదినిస్తా
కలసి మెలసి పోతే ఓ మెరిసి కురిసి వెళతా
వాల్మీకిలా వేటాడితే ప్రేమాయణం వర్ణించుతా
లలితా ముడిపడతా పద ఆ
మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా
పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా
ప్రియతమ పదవందిస్తే ఆ పుడమిని ఎదురిస్తా
జిగిబిగి సొగసందిస్తే ఈ జగతిని బదులిస్తా
రా రా నాదా ఓ