Оберіть трек для відтворення
సుఖీభవ సుమంగళి సుఖీభవా
సుశీలవై చిరాయువై సుఖీభవా
ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేననీ
నిండుగా నూరేళ్లుగా ఉండిపొమ్మనీ
సుఖీభవ సుమంగళి సుఖీభవా
సుశీలవై చిరాయువై సుఖీభవా
శతమానం భవతి అని నిన్ను దీవించి
గతకాలం స్మృతిలోనే బ్రతుకు సాగించి
ఆ కుంకుమ రేకుల కెంపులు పూయగా
ఆ పూసిన పువ్వుల నోములు పండగా
కదలి రావమ్మా ఆ ఆ
ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేననీ
నిండుగా నూరేళ్లుగా ఉండిపొమ్మనీ
సుఖీభవ సుమంగళి సుఖీభవా
సుశీలవై చిరాయువై సుఖీభవా
అనురాగం కోవెలలో ఆది దంపతులై
కనులారా మిము చూసే జన్మ ధన్యమై
ఒక జీవితకాలం చాలని ప్రేమలో
సుఖశాంతులు విరిసే చల్లని తల్లిగా
నిలిచిపోవమ్మా ఆ ఆ
ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేననీ
నిండుగా నూరేళ్లుగా ఉండిపొమ్మనీ
సుఖీభవ సుమంగళి సుఖీభవా
సుశీలవై చిరాయువై సుఖీభవా