Оберіть трек для відтворення
గాంధారి గాంధారి నీ మరిది గాంధారి
దొంగ సందమామలాగా వంగి చూసిండే
గాంధారి గాంధారి నీ మరిది గాంధారి
దొంగ సందమామలాగా వంగి చూసిండే
గాంధారి గాంధారి నీ మరిది గాంధారి
సెంగు సెంగునొచ్చి హోలీ రంగు సల్లిండే
పోయిన ఏడు ఇంత పోకిరి కాదు
రైకల వాసనే తెలియనే వాడు
ఇంతలోపల ఏమి జరిగెను
సూదుల సూపుతో గుచ్చుతున్నాడే
గాంధారి నీ మరిది ఏందేందో చేసిండే
సింధూరి సెంపాకు సిరి గంధం పూసిండే
గాంధారి నీ మరిది గందరగోళం సందడి
మందిలోన ఎట్లా సెప్పమందు వాని అంగాడి
సింగారం బొమ్మనట
మందారం రెమ్మనట
పిందెలాగా ఉండే లంక బిందె వంటాండే
కందిరీగ నడుమంట
కందిపూలు ఒళ్ళంట
ఎందుకిట్ల ఎండలోన కందిపోతుండావని
రందిపడి భుజాన కూసుందువు రమ్మంటాండే
గాంధారి గాంధారి నీ మరిది గాంధారి
దొంగ సందమామలాగా వంగి చూసిండే
గాంధారి గాంధారి నీ మరిది గాంధారి
సెంగు సెంగునొచ్చి హోలీ రంగు సల్లిండే
బంగారు సీతారామ సింగారు లగ్గానికి
సేంగాబి సీర గట్టి మంగళారతి ఇస్తాంటే
రంగు జల్లి ఎదురుకోళ్ల రంగు పండగంటాండే
పండుగ ఏదైనా రంగు పండుగనే అంటాండే
గాంధారి గాంధారి నీ మరిది గాంధారి
దొంగ సందమామలాగా వంగి చూసిండే
గాంధారి గాంధారి నీ మరిది గాంధారి
సెంగు సెంగునొచ్చి హోలీ రంగు సల్లిండే