Оберіть трек для відтворення

హే మబ్బుల్లోన దాగి ఉన్న చందమామ
నిన్ను మించిన అందముంది చూడవమ్మ
కళ్ళు చూసి కులుకోదా కలువ భామ
ఆమే ముందు ఎవరైనా నిలవరమ్మ హోయ
ఆకాశం నేలకు వచ్చింది
చిరుజల్లుగా మారి
నాతోటి చింతులు వేసింది
ఆనందం అంచులు దాటింది
మరుమల్లెగా మారి
నీ కోసం పల్లవి పాడింది
నా గుండెలో ఈ ఊపిరి
నీ పేరునే అడిగింది
నా కళ్ళలో ఈ కాంతిని
నువ్వేనని తెలిపింది
పరిచయం కలగని
తోలి తోలి వయసుని
తెలిసి మనసు పడని
నువ్వు నాకు మనసిస్తే
నిన్ను చేరుకుంటా
మరి కాస్త చనువిస్తే
నీ సొంతమవుతా
ఆకాశం నేలకు వచ్చింది
చిరుజల్లుగా మారి
నాతోటి చింతులు వేసింది
నిన్ను చూసిన నిమిషంలో
అద్దమంటి నా హృదయంలో
అలజడి రేగింది పులకాలు రెపింది
ఎంత చెప్పినా వినకుండా
ఎరులాగా నా మనసంత
గలగల పారింది ఊరకలు వేసింది
నీ ఊసులే నాతో ఇలా
చెప్పిందిలే చిరుగాలి
నాతో మరిదొబ్బుశుల
రావే ఇలా ఒకసారి
వివరము అడగక
ఎదురుగా నిలబడు
కలల తేరాలు వదిలి
నువ్వు నాకు మనసిస్తే
నిన్ను చేరుకుంటా
మరి కాస్త చనువిస్తే
నీ సొంతమవుతా
ఆకాశం నేలకు వచ్చింది
చిరుజల్లుగా మారి
నాతోటి చింతులు వేసింది
ఎలెలో ఎలెలో రామ సక్కని కుర్రాడే
ఏ ఊరి పిల్లాడో రాసలీలకు వచ్చాడే
పచ్చని పంటల్లో ఎన్నో ముచ్చట్లుాడాడే
చల్లని గుండెల్లో ఆడే చిచ్చుని రేపాడే
నాకోసం పుట్టాడోయమ్మ
ఈ అల్లరి గాడు
మనసంత దొచ్చాడోయమ్మ హోయ
వానవిల్లులో మెరుపంత
నీ వంపు సొంపులో గమనించ
తలుకుల చిరునామా
నువ్వేలే మాయినా
సంధె పొద్దులో ఎరుపంత
నీ పాల బుగ్గలో చిటికంత
తెలియని బిడియాలే వొదిగెను నీలోన
నీ నవ్వుతో పున్నాగమే
పూచిందిలే సుకుమారి
నీ రాకతో నా జన్మకే
వెలుగొచ్చెనే తెలవారీ
ఊరుకుల పరుగుల
పరువపు వయసుని
చెలియా వెంటపడని
నువ్వు నాకు మనసిస్తే
నిన్ను చేరుకుంటా
మరి కాస్త చనువిస్తే
నీ సొంతమవుతా