Оберіть трек для відтворення
Сингл / Трек
సూరీడే గొడుగు పట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మ చీకటిలోను
నీడలుంటేటోడు
రెప్పనొదలకా కాపు
కాసేడీ కన్నువాడు
ఆకాశం ఇడిశిపెట్టి
ముద్దెత్తే పొలం మట్టి
ఎండ భగ భగ తీర్చే
చినుకుల దూకుతాడు
ముప్పు కలగక ముందు
నిలబడి ఆపుతాడు
యే యే యే, ఖడ్గమొకడైతే
కలహాలు ఒకడివిలే
ఒకడు గర్జన, ఒకడు ఉప్పెన
వేరసి ప్రళయాలే
సైగ ఒకడు, సైన్యమొకడు
కలిసి కదిలితే కథనమే
ఒకరికొకరిని నమ్మి నడిచిన
స్నేహమే ఇదిలే
నూరేళ్ళు నిలవాలే
యే యే యే, కంచె ఒకడైతే
అది మించే వాడొకడే
ఒకడు చిచ్చుర, ఒకడు తేమెర
కలిసి దహనాలే
వేగమొకడు, త్యాగమొకడు
గతము మరువని గమనమే
ఒకరికొకరిని నమ్మి నడిచిన
స్నేహమే ఇదిలే
నూరేళ్ళు నిలవాలే
సూరీడే గొడుగు పట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మ చీకటిలోను
నీడలుంటేటోడు
రెప్పనొదలకా కాపు
కాసేడీ కన్నువాడు